సుప్రీంకోర్టు: ముందే టపాసులు కొనుక్కున్న వారు కాల్చుకోవచ్చు: 'ఢిల్లీలో టపాసుల నిషేధం'పై సుప్రీంకోర్టు
- బాణసంచా వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ
- నిషేధం విధించక ముందు టపాసులు కొనుక్కున్న వారు వాటిని కాల్చుకోవచ్చు
- నిషేధం ఎత్తివేతకు నిరాకరణ
విపరీతంగా పెరిగిపోతోన్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పర్వదినం సమీపిస్తోన్న వేళ ఢిల్లీలో బాణసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అభ్యంతరాలు తెలుపుతూ బాణసంచా వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
నిషేధం ఎత్తివేతకు నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. తాము ముందుగా పేర్కొన్నట్లుగానే ఈ నెల 31 వరకు బాణసంచా విక్రయాలపై నిషేధం ఉంటుందని తెలిపింది. తమ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే, నిషేధం విధించక ముందు టపాసులు కొనుక్కున్న వారు మాత్రం దీపావళి రోజున వాటిని కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.