కీర్తి సురేష్: పవన్ కల్యాణ్ నన్ను మెచ్చుకున్నారు: హీరోయిన్ కీర్తి సురేష్

  • ‘భైరవ’ సినిమాలో నా నటన బాగుందని పవన్ ప్రశంసించారు
  • గ్లామర్ పాత్రల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు
  • మరో ఐదేళ్ల తర్వాత అడిగినా ఇదే సమాధానం చెబుతా
  • ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్

గ్లామర్ పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని, మరో ఐదేళ్ల తర్వాత అడిగినా ఇదే సమాధానం చెబుతానని, ఆ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ చెప్పింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తోంది.

 ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను నటించిన ‘భైరవ’ సినిమా గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఈ సినిమాలో బాగా నటించానని మెచ్చుకున్నారు’ అని చెప్పింది. ‘మహానటి’ సినిమాలో ఆమె నటిస్తున్న విషయమై ప్రశ్నించగా, ‘మహానటి సావిత్రిలా నటించడం చాలా కష్టమైన విషయం. ఆమెలా నటించానని చెప్పడం కరెక్టు కాదు. ఈ సినిమా కోసమే సావిత్రి నటించిన సినిమాలను చూశా. సావిత్రి పాత్రలో నటించాలంటే మొదట్లో నేను భయపడ్డా. కానీ, సవాలుగా తీసుకుని ఆ పాత్రలో నటిస్తానని చెప్పాను. ‘మీరు మాత్రమే ఈ పాత్రకు వందశాతం నప్పుతారు’ అని ‘మహానటి’ నిర్మాత నాతో అన్నారు. అంతేకాకుండా, సావిత్రి కుమార్తె చాముండేశ్వరి కూడా అదేమాట చెప్పారు’ అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News