టపాసులపై నిషేధం: దీపావళి రోజున మూడు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలి: పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలు
- ఇటీవలే ఢిల్లీలో టపాసులపై నిషేధం
- తాజాగా పంజాబ్-హర్యానా హైకోర్టు నిర్ణయంతో మరో షాక్
- దీపావళి పర్వదినాన సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే కాల్చాలి
- ప్రజలు ఆదేశాలను పట్టించుకోకుంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి
ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతోన్న వాతావరణ కాలుష్యం నేపథ్యంలో అక్కడ బాణసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని ప్రముఖుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక బాణసంచా అమ్మకం దారులు తాము నష్టపోకుండా టపాసులను విక్రయించడానికి కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ రోజు టపాసులు కాల్చేందుకు సమయ పరిమితిని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పర్వదినాన సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రజలకు సూచించింది.