: 'సోనియమ్మా.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రాకండి'


ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. పార్లమెంట్ లో ఆయన విగ్రహావిష్కరణకు రావొద్దంటూ కాంగ్రెస్ ఎంపీలు సోనియాను కోరారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు ఈ రోజు అధినేత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ ప్రవేశ ద్వారం వద్ద రేపు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలంటూ ఇప్పటికే సోనియాగాంధీకి ఆహ్వానం వెళ్లింది. ఆమె హాజరవ్వాలని కూడా అనుకున్నారు. మరి ఎంపీల తాజా అభ్యర్థనతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి!

  • Loading...

More Telugu News