చంద్రబాబు: ‘పేషెంట్ ఫస్ట్’ అనే విధానాన్ని అమలు చేయాలి: సీఎం చంద్రబాబు ఆదేశం

  • వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి
  • పది రోజుల్లో 21 లక్షల దోమ తెరలు పంపిణీ చేయాలి
  • ఇక నుంచి వైద్య, ఆరోగ్య శాఖపై ప్రతి నెలా సమీక్షిస్తా

వైద్య, ఆరోగ్య శాఖలో ‘పేషెంట్ ఫస్ట్’ అనే విధానాన్ని అమలు చేయాలని, అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబరేటరీలను సిద్ధంగా ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇక నుంచి వైద్య, ఆరోగ్య శాఖపై ప్రతి నెలా సమీక్షిస్తానని పేర్కొన్నారు. పది రోజుల్లో 21 లక్షల దోమ తెరలు పంపిణీ చేయాలని, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహన సేవల వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. 

  • Loading...

More Telugu News