తుమ్మల: ఆ క్రెడిట్ నాది కాదు..పూర్తిగా తుమ్మలదే: కేసీఆర్ ప్రశంస

  • పాలేరుని అభివృద్ధి చేసిన తీరు ఆదర్శనీయం
  • అపర భగీరథుడిలా తుమ్మల కష్టపడ్డారు
  • సూర్యాపేట సభలో కేసీఆర్ 

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి చేసిన తీరు ఆదర్శనీయమని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతిసభలో ఆయన మాట్లాడుతూ, ‘అపర భగీరథుడిలా కష్టపడి 10 నెలల్లో ప్రజలకు నీరు ఇచ్చారు. ఆ క్రెడిట్ నాది కాదు..పూర్తిగా తుమ్మలదే’ అని ప్రశంసించారు.

కాగా, సూర్యాపేట జిల్లాలో ఈ రోజు పర్యటించిన కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్, పోలీస్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. చివ్వెం మండలంలోని వీకే పహాడ్ లో 400 కేవీ సబ్ స్టేషన్ ని, చందుపట్లలో మిషన్ భగీరథ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను, యాదవనగర్ లో 192 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News