రైన్: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నరకం చూస్తోన్న వాహనదారులు!
- కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వేళ భారీ వర్షం
- ఉద్యోగుల అవస్థలు
- రోడ్లపై నిలిచిన నీరు
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వేళ అతి భారీ వర్షం పడుతుండడంతో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, సరూర్ నగర్, కొత్తపేట, దిల్‌సుఖ్ నగర్, మోహన్ నగర్, నాగోల్, ముసారంబాగ్, మలక్‌పేట, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, మోతీనగర్, అమీర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, లక్డీకపూల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.