సమంత: ప్రెస్ మీట్లో న‌వ్వులు పూయించిన స‌మంత‌!

  • సినిమాకు సంబంధించిన ఓ విష‌యాన్ని చెబుదామ‌నుకున్న స‌మంత
  • వద్దని చెప్పిన సినిమా టీమ్
  • చెప్పొద్దంటున్నారన్న సమంత 
  • బిగ్గరగా నవ్వేసిన రాజుగారి గది-2 సినిమా టీమ్

తాను న‌టించిన ‘రాజుగారి గ‌ది-2’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స‌మంత తెలుగులో గలగలా మాట్లాడింది. త‌నపై ఎంతో అభిమానం చూపిస్తోన్న మీడియా వారందరికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొంది. ఈ సినిమాపై ఇంత‌టి పాజిటివ్‌గా మాట్లాడుతోన్న సినిమా బృందాన్ని చూస్తే త‌న‌కు భ‌యం వేస్తోంద‌ని స‌మంత చెప్పింది. ఈ సినిమాలో ప‌నిచేసిన అనుభ‌వం ఎంతో బాగుంద‌ని చెప్పింది.

ఈ సినిమాలో త‌న పాత్ర అంద‌రికీ న‌చ్చుతుంద‌ని చెప్పింది. నాగార్జున‌, ఓంకార్ మంచి సినిమా చేశారని తెలిపింది. ఇంత‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ విష‌యాన్ని చెబుదామ‌ని స‌మంతా అనుకుంది. అయితే, ఆ విష‌యాన్ని చెప్ప‌కూడ‌ద‌ని సినిమా బృందం అన‌డంతో 'చెప్ప‌కూడ‌ద‌ట' అంటూ స‌మంత నవ్వేసింది. దీంతో అంద‌రూ బిగ్గ‌ర‌గా న‌వ్వేశారు.  

  • Loading...

More Telugu News