అమితాబ్: జీవితం ముగిసిపోయే క్షణంలో ఇవన్నీ ఎందుకు? : అమితాబ్ బచ్చన్
- తన పుట్టినరోజు జరుపుకోకపోవడంపై బిగ్ బీ స్పందన
- 75 ఏళ్ల తర్వాత అన్నింటికీ దూరంగా వెళ్లిపోతాం
- బ్లాగ్ లో అమితాబ్ ఆసక్తికర పోస్ట్
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ నిన్న తన 75వ పుట్టినరోజును ఎటువంటి ఆర్భాటం లేకుండా కేవలం తన కుటుంబసభ్యుల మధ్యే ఆయన గడిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు బిగ్ బీ వెళ్లి వచ్చారు. అమితాబ్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకపోవడంపై ఆయన అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అమితాబ్ తన బ్లాగ్ ద్వారా చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది.
‘75 ఏళ్ల తర్వాత అన్నింటికీ దూరంగా వెళ్లిపోతాం. ఈ వయసులో వేడుకలు జరుపుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎవరెవర్ని ఆహ్వానించాలి?.. ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతాయి. జీవితం ముగిసిపోయే క్షణంలో ఇవన్నీ ఎందుకు? నా వాళ్ల మధ్య కూర్చుని వాళ్లు చెప్పే సంగతులు వింటుంటే నన్ను నేనే కోల్పోతున్నాననే భయం కలుగుతోంది..’ అని తన బ్లాగ్ లో అమితాబ్ చెప్పుకొచ్చారు.