ఓంకార్: రేపు మామాకోడళ్ల విశ్వరూపం చూడబోతున్నారు: సమంత, నాగార్జున గురించి దర్శకుడు ఓంకార్
- సమంత కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెస్ రేపు చూస్తారు
- ఈ విషయాన్ని రేపు అందరూ చెబుతారు
- టెక్నీషియన్స్ ఎంతగానో సపోర్ట్ చేశారు.. నాగార్జునకి రుణపడి ఉంటా
- యాంకరింగ్ స్టార్ట్ చేసేటప్పుడే దర్శకుడిని కావాలనుకున్నా
రేపు మామాకోడళ్ల విశ్వరూపం చూడబోతున్నారని దర్శకుడు ఓంకార్ అన్నారు. నాగార్జున, సమంత నటించిన రాజుగారి గది-2 సినిమా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓంకార్ మాట్లాడుతూ... సమంత కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెస్ రేపు చూస్తారని అన్నారు. ఇది తాను చెప్పడం కాదని, రేపు అందరూ చెబుతారని అన్నారు. చిత్ర నిర్మాణంలో టెక్నీషియన్స్ ఎంతగానో సపోర్ట్ చేశారని అన్నారు.
పెద్ద హీరోతో సినిమా తీస్తున్నానన్న భయం తనలో లేకుండా నాగార్జున చేశారని అన్నారు. యాంకరింగ్ స్టార్ట్ చేసేటప్పుడే తాను దర్శకుడిని కావాలనుకున్నానని అన్నారు. తన మూడో మూవీకే నాగార్జునతో సినిమా తీసే అవకాశం వచ్చిందని అన్నారు. రామ్ గోపాల్ వర్మ నుంచి ఓంకార్ వరకు నాగార్జున ఎంతమందికో ఇటువంటి అవకాశాలు ఇచ్చారని అన్నారు.
రాజుగారి గది లాంటి చిన్న సినిమా చేసిన తనకు అవకాశం ఇచ్చారని, ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. సమంతకి కూడా తాను రుణపడి ఉంటానని చెప్పారు. పెద్ద దర్శకులతో చేసిన సమంత తన సినిమాలో నటించడం తన అదృష్టమని అన్నారు. రేపటి రోజు కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ సినిమాలో ఎంత ఎమోషన్ ఉంటుందో రేపు చూస్తారని అన్నారు.
వెన్నెల కిశోర్, ప్రవీణ్, అశ్విన్, షకలక శంకర్ కామెడీని ఇరగదీశారని అన్నారు. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గా సినిమా ఉంటుందని చెప్పారు. తనను నమ్మి నాగార్జున, సమంత ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని ఓంకార్ చెప్పారు.