వైజాగ్: కేన్సర్ పై పోరాటం.. వైజాగ్ ర్యాలీలో పాల్గొననున్న బాలకృష్ణ
- సినీ నటి గౌతమి సొంత ఫౌండేషన్ ‘లైఫ్ ఎగైన్’ ఆధ్వర్యంలో 28న ర్యాలీ
- ఈ ర్యాలీలో పాల్గొననున్న పలువురు ప్రముఖులు
- తన అభిమానులకు పిలుపు నిచ్చిన బాలయ్య
ప్రముఖ నటి గౌతమి ప్రారంభించిన ‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ ద్వారా కేన్సర్ పై అవేర్ నెస్ ర్యాలీని వైజాగ్ లో నిర్వహించనున్నారు. ఈ నెల 28న నిర్వహించనున్న ఈ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ, అరకు ఎంపీ కొత్తపల్లి గీత, టాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బాలయ్య తన అభిమానులకు పిలుపు నిచ్చారు. కాగా, హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, రీసెర్చి సెంటర్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ కేన్సర్ నివారణకు తన వంతు పాత్రను పోషిస్తున్నారు.