సమంత: పెళ్లి తరువాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన సమంత
- ‘రాజుగారి గది-2’ సినిమా రేపు విడుదల
- ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో మీడియా సమావేశం
- చిరునవ్వులు చిందిస్తూ పాల్గొన్న కొత్త పెళ్లి కూతురు సమంత
ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న ‘రాజుగారి గది-2’ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కొత్త పెళ్లి కూతురు సమంత పెళ్లి తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగార్జునతో కలిసి ఆమె పాల్గొంది. ఎల్లో కలర్ డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తూ సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమంతతో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఎగబడ్డారు.