అల్లు శిరీష్: 9 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ తో కలిసి షాపింగ్ చేసిన ఫొటోలను పోస్ట్ చేసిన అల్లు శిరీష్!

  • 2008లో దుబాయ్‌లో ఆర్యా-2 సినిమా కోసం షాపింగ్
  • స‌ర‌దా స‌మయం అని పేర్కొన్న అల్లు శిరీష్
  • అలరిస్తోన్న పాత ఫొటోలు

తొమ్మిదేళ్ల క్రితం తన సోదరుడు అల్లు అర్జున్ తో క‌లిసి షాపింగ్ చేసిన సంద‌ర్భంగా దిగిన ఫొటోల‌ను అల్లు శిరీష్ ఈ రోజు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘2008లో దుబాయ్‌లో ఆర్యా-2 సినిమా కోసం బ‌న్ని, స్టైలిష్ అశ్విన్ వాలెతో షాపింగ్.. స‌ర‌దా స‌మయం’ అని అల్లు శిరీష్ పేర్కొన్నాడు. ఆర్యా-2 సినిమాలో క‌న‌ప‌డిన లుక్‌తో బ‌న్ని ఈ ఫొటోలో క‌న‌ప‌డుతున్నాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు వంటి వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అల్లు శిరీష్ చేతిలో ప్ర‌స్తుతం మ‌రో సినిమా ఉంది. కాగా, 'డీజే'తో మంచి విజ‌యం అందుకున్న‌ అల్లు అర్జున్ ప్రస్తుతం 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సినిమాలో న‌టిస్తున్నాడు.

  • Loading...

More Telugu News