హర్భజన్ సింగ్: ఈ వీడియో చూసి ఎంతో బాధపడ్డా: హర్భజన్ సింగ్

  • తల్లిదండ్రులకు ఓ విన్నపం
  • దయచేసి, మీ పిల్లలను మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు దూరంగా ఉంచండి
  • ఏదీ మితిమీరి వాడటం మంచిదికాదు
  • ట్వీట్ లో సూచించిన హర్భజన్ సింగ్

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్ ల వినియోగం ఎంతగా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలు సైతం మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడటం, మ్యూజిక్ వినడం, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించడం కామన్ అయిపోయింది. అయితే, చిన్నపిల్లలు మొబైల్ ఫోన్ కి బానిసై పోవడం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పే ఓ వీడియోను టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోపై కామెంట్ చేస్తూ..‘ఈ వీడియో చూసి ఎంతగానో బాధపడ్డా. ఒకవేళ ఇదే నిజమైతే! తల్లిదండ్రులకు ఓ విన్నపం చేస్తున్నా. దయచేసి, మీ పిల్లలను మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు దూరంగా ఉంచండి. ఏదీ మితిమీరి వాడటం మంచిదికాదు’ అని సూచించాడు. ఇంతకీ, ఆ వీడియోలో ఏముందంటే.. ఆసుపత్రిలో మంచంపై పడుకుని ఉన్న ఓ చిన్నారి విలవిలా కొట్టుకుంటోంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి తన చేతిలోని మొబైల్ ఫోన్ ని చూపించగానే ఆ చిన్నారి కాళ్లూచేతులు కొట్టుకోవడం ఆపేసింది. ఆ ఫోన్ ని పక్కకు తీయగానే మళ్లీ అదే పరిస్థితికి వెళుతుండటం గమనార్హం.
   

  • Loading...

More Telugu News