అసియా అంద్రబి: మహిళా ప్రముఖుల ఫొటోల పక్కన వేర్పాటువాది అసియా అంద్రబి ఫొటో!

  • జమ్ముకశ్మీర్ లో సంఘటన
  • ‘బేటి బచావో-బేటి పడావో’ బ్యానర్ లో అసియా అంద్రబి ఫొటో
  • ఈ సంఘటనపై విచారణకు ఆదేశించిన జమ్ముకశ్మీర్ ప్రభుత్వం

మహిళా ప్రముఖుల ఫొటోలు ఉన్న బ్యానర్ లో కశ్మీర్ వేర్పాటువాద మహిళా నేత అసియా అంద్రబి ఫొటో ఉండటం పలు విమర్శలకు దారితీస్తోంది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్ లో నిన్న నిర్వహించిన ‘బేటి బచావో-బేటి పడావో’ ప్రచార కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కల్పనా చావ్లా, సానియామీర్జా, లతా మంగేష్కర్ ఫొటోల పక్కనే అసియా అంద్రబి ఫొటో కూడా ముద్రించారు.

ఈ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ అయింది. ఈ సంఘటనపై విచారణకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. కాగా, రెండేళ్ల క్రితం కశ్మీర్ లోని భద్రతా సిబ్బందిపైకి మహిళలను రెచ్చగొట్టి రాళ్ల దాడి చేయించినందుకు ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

  • Loading...

More Telugu News