చెన్నై: చెన్నైలో మరో ఘటన.. కుక్క మెడకు రెండు తాళ్లు కట్టి లాక్కెళ్లిన వైనం.. వీడియో వైరల్!

  • ఊపిరి ఆడక అరుపులు పెట్టిన శునకం
  • స్పందించిన కేంద్ర మంత్రి మేనకాగాంధీ
  • కొనసాగుతోన్న విచారణ
  • ఇద్దరు యువకులపై బ్లూ క్రాస్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు

మూగ జీవాల‌ను హింసించడ‌మే కాకుండా ఆ సంద‌ర్భంగా తీసిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘ‌ట‌న‌లు ప‌లుసార్లు చెన్నైలో వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. తాజాగా అటువంటిదే మ‌రో ఘ‌ట‌న అదే చెన్నైలో వెలుగులోకొచ్చింది. ఓ కుక్క మెడ‌కు తాళ్లు క‌ట్టి ఇద్ద‌రు యువ‌కులు దాన్ని లాక్కెళ్లారు. ఆ మూగ జీవి బాధ‌తో పెట్టిన అరుపుల‌ను ఆ యువ‌కులు ప‌ట్టించుకోలేదు. మెడ‌కు తాళ్లు క‌ట్ట‌డంతో ఆ కుక్క శ్వాస తీసుకోవ‌డంలోనూ ఇబ్బంది ప‌డింది.

ఇందుకు సంబంధించిన‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో కేంద్ర మంత్రి, జంతు ప్రేమికురాలు మేన‌కా గాంధీ స్పందించి, విచార‌ణ‌కు ఆదేశించారు. ఆ మూగ‌జీవిని హింసించిన వారిపై బ్లూ క్రాస్ సంస్థ ద‌ర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘ‌ట‌న ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూష‌న్ లో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఆ కుక్క‌ను లాక్కుని పోయిన వారు దాన్ని ఓ వ్యానులో ప‌డేశార‌ని, ఆ వాహ‌నంలో మ‌రో 11 శున‌కాలు కూడా ఉన్నాయ‌ని, ఆ వ్యాను తాంబ‌రం మున్సిపాలిటీకి చెందింద‌ని తెలిసింద‌ని బ్లూ క్రాస్‌ సంస్థ ప్ర‌తినిధులు చెప్పారు. ఎటువంటి అనుమ‌తులు లేకుండా వారు మూగ‌జీవాల‌ను త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. సుంద‌రం, దేవ అనే ఇద్ద‌రు యువ‌కుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని చెప్పారు. 

  • Loading...

More Telugu News