రేడియో సిటీ: ‘రేడియో సిటీ’లో శివబాలాజీకి సర్ ప్రైజ్!
- ‘బిగ్ బాస్’ వాయిస్ తో శివబాలాజీకి పలకరింపు
- కేక్ కట్ చేసిన ‘బిగ్ బాస్’ విజేత
- సామాజిక మాధ్యమాలకు చేరిన ఈ వీడియో
గత నెలలో ముగిసిన ‘బిగ్ బాస్’ సీజన్ -1 ట్రోఫీని, క్యాష్ ప్రైజ్ ను నటుడు శివబాలాజీ కైవసం చేసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత ‘బిగ్ బాస్’లో తన అనుభవాల గురించి తెలియజేస్తూ పలు ఛానెల్స్ కు శివబాలాజీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తాజాగా, హైదరాబాద్ లోని ఎఫ్ ఎం రేడియో ‘రేడియో సిటీ’ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లాడు.
ఈ సందర్భంగా ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం, ‘బిగ్ బాస్’ వాయిస్ ను పోలి ఉండే ఓ వాయిస్ తో శివబాలాజీని పలకరిస్తూ సర్ ప్రైజ్ చేశారు. ‘శివబాలాజీ గారు, బిగ్ బాస్ చెబుతున్నారు. మీరు, మీ ఫైనల్ టాస్క్ కు రెడీయా? టాస్క్ పేరు.. ‘ఫ్యూచర్ ప్రొటెక్షన్’ అంటే.. ముందేమవుతుందో మీరు గెస్ చేయాలి.... లైట్స్ ఆఫ్ చేయండి. శివబాలాజీగారు మీరు కళ్లు మూసుకోండి’ అంటూ ఆ వాయిస్ వినిపించింది.
ఆ తర్వాత లైట్స్ తీసివేయడం.. కొంచెం సేపటి తర్వాత లైట్స్ వేయడం జరిగింది. అనంతరం, ఓ కేక్ ను కట్ చేసిన శివబాలాజీ, ‘థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.