హైదరాబాద్: హైదరాబాద్‌లో థియేటర్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్ వద్ద ఆంక్షలు
- జనం గుమిగూడి కనిపిస్తే తక్షణమే ప్రత్యేక చర్యలు
- జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యూ పద్ధతి పాటించాలి
- హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్‌లోని థియేటర్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, కాలేజీలు, వైన్ షాపులు, హోటళ్ల వంటి ప్రాంతాల్లో 15 రోజుల పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. ఒక్కసారిగా ఈ ఆంక్షలు ఎందుకు విధించారన్న అంశంపై స్పష్టత రాలేదు. ఒకవేళ జనం గుమిగూడి కనిపిస్తే తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యూ పద్ధతి పాటించాలని అన్నారు.