లోకేశ్: నా ఇంటికేమైనా సిమెంట్ బస్తాలు వస్తున్నాయా?: మంత్రి లోకేశ్

  • నిధులు రాకుండా పేదల పొట్టకొడుతున్న ప్రతిపక్షం
  • ఈ నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారంటూ కేంద్రానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు 
  • ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షం ఇలా వ్యవహరించదు
  • అభివృద్ధి కోసం నిధులు వాడితే తప్పేమిటన్న లోకేశ్

ప్రతిపక్షం కావాలనే కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్) నిధులు రాకుండా పేదల పొట్టకొడుతోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘ఆ నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారంటూ, కేంద్రానికి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. సుబ్బారెడ్డి నియోజకవర్గంలోనే 200 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాం. ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షం ఈ విధంగా వ్యవహరించడం లేదు. నా ఇంటికేమైనా సిమెంట్ బస్తాలు వస్తున్నాయా? అభివృద్ధి కోసం నిధులు వాడితే తప్పేంటి?’ అని మండిపడ్డారు.

ఐటీలో గత ఏడాది కంటే పురోగతి సాధించామని, భూములు తీసుకుని పనులు ప్రారంభించని సుమారు 20 ఐటీ కంపెనీలకు నోటీసులు ఇవ్వనున్నట్టు చెప్పారు. గ్రామపంచాయతీల విద్యుత్ బకాయిలు గుదిబండగా మారాయని, వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గత ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు.

  • Loading...

More Telugu News