చంద్రబాబు: సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు

  • రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది
  • కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు
  • పాదయాత్ర అనేది వైఎస్ ఫ్యామిలీ బ్రాండ్
  • మీడియాతో రోజా

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని, కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం సంక్షోభంలో ఉందని, చంద్రబాబు జల్సాల కోసం అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించారు.

ఈ సందర్భంగా నవంబర్ 2 నుంచి జగన్ తలపెట్టనున్న పాదయాత్ర గురించి ఆమె ప్రస్తావించారు. పాదయాత్ర అనేది వైఎస్ ఫ్యామిలీ బ్రాండ్ మార్క్ అని, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యతతో జగన్ పాదయాత్రకు సిద్ధమయ్యారని అన్నారు. ‘యువభేరీ’ విజయవంతం కావడంతో మంత్రులకు పిచ్చెక్కిందని, ప్రత్యేక ప్యాకేజ్ తో ఏపీకి చేకూరిన ప్రయోజనం గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా రోజా డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News