కల్యాణ్ రామ్: ఆదిలాబాద్‌లో ట్రాక్టర్ పై కూర్చొని కల్యాణ్ రామ్, శేఖర్ మాస్టర్ సెల్ఫీ
- ‘ఎమ్మెల్యే’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోన్న కల్యాణ్ రామ్
- ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌కి జోడీగా కాజల్
- ఆదిలాబాద్ లో షూటింగ్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఎమ్మెల్యే’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆదిలాబాద్‌లో జరుగుతోంది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్‌కి జోడీగా కాజల్ నటిస్తోంది. బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆదిలాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ వద్దకు వచ్చిన డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కల్యాణ్ రామ్‌తో సెల్ఫీ దిగాడు. ఓ ట్రాక్టర్‌పై కూర్చుని కండువాని తలపాగాగా చుట్టుకున్న కల్యాణ్ రామ్ కళ్లజోడు పెట్టుకుని సెల్ఫీకి పోజిచ్చాడు. కల్యాణ్ రామ్‌ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.