వర్మ: ‘లక్ష్మీ`స్ ఎన్టీఆర్’లో హీరోయిన్ గా లక్ష్మీపార్వతినే పెట్టుకోండి... వర్మపై మంత్రి సోమిరెడ్డి విమర్శలు
- వర్మపై సోమిరెడ్డి విమర్శలు
- తీసిన సినిమాలు హిట్టయ్యేలా చూసుకోవాలని సూచన
- ‘లక్ష్మీ`స్ ఎన్టీఆర్’లో హీరోయిన్ గా లక్ష్మీపార్వతినే పెట్టుకోండి!
పనీపాటలేని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాల్లో ఉంటారని, తీసిన సినిమాలు హిట్టయ్యేలా చూసుకోవాలని సూచించారు. ‘‘లక్ష్మీ`స్ ఎన్టీఆర్’ అనే సినిమా తీయడం సంతోషకరం. త్యాగశీలి లక్ష్మీపార్వతి.. సినిమాలో హీరోయిన్ గా ఆమెనే పెట్టుకోమనండి’ అంటూ సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీ`స్ ఎన్టీఆర్’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వైసీపీ నాయకుడు రాకేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.