ftii: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా అనుపమ్ ఖేర్ నియామకం
- గతంలో సీబీఎఫ్సీకి చైర్మన్గా పనిచేసిన అనుపమ్
- పద్మశ్రీ, పద్మభూషణ్ గ్రహీత
- అరవై రెండేళ్ల అనుపమ్ పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియమితులయ్యారు. గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలకు చైర్మన్గా అనుపమ్ ఖేర్ పనిచేశారు. 62 ఏళ్ల అనుపమ్ ఖేర్ సారాంశ్, డాడీ, రామ్ లఖన్, దిల్వాలే దుల్హానియా లేజాయేంగే వంటి సినిమాల్లో నటించారు. 2004లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అవార్డులను అనుపమ్ ఖేర్ సాధించుకున్నారు.