కేసీఆర్: కాన్వాయ్‌ని ఆపి తన బాల్య మిత్రులను పలకరించిన సీఎం కేసీఆర్

- సిద్దిపేట పర్యటనలో కేసీఆర్
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
- ములుగు వద్ద జాతీయరహదారిపై కాన్వాయ్ ని ఆపిన కేసీఆర్
- బాల్య స్నేహితులను వాహనంలో ఎక్కించుకుని వెళ్లిన సీఎం
సిద్దిపేట పర్యటనకు వెళుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు వద్ద జాతీయరహదారిపై కాసేపు తన కాన్వాయ్‌ని ఆపమన్నారు. అక్కడ తన చిన్ననాటి స్నేహితులు జహంగీర్, అంజిరెడ్డిలను పలకరించి, సిద్దిపేట పర్యటనకు తనతో పాటు వారిని వాహనంలో తీసుకెళ్లారు. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాహనం దిగి తన చిన్ననాటి స్నేహితులను పలకరించడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేశారు. కాగా, సీఎం కేసీఆర్ సిద్దిపేటతో పాటు రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.