హనీప్రీత్ సింగ్: ఎట్టకేలకు చేసిన నేరాన్ని ఒప్పుకున్న హనీప్రీత్!
- ఇన్ని రోజులూ విచారణకు సహకరించని హనీప్రీత్
- పంచకులలో జరిగిన అల్లర్లకు కారణం నేనే
- అల్లర్లకు గైడ్ మ్యాప్‌లు తయారుచేశా
డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సన్నిహితురాలు హనీప్రీత్ విచారణకు సహకరించడం లేదన్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలు చెబుతూ, మౌనంగా ఉంటూ వస్తోన్న ఆమె ఎట్టకేలకు నిజం చెప్పింది. గుర్మీత్‌కు శిక్ష పడిన నేపథ్యంలో హర్యానాలోని పంచకులలో జరిగిన అల్లర్లకు తానే కారణం అని అంగీకరించింది. తమ అనుచరుల సాయంతో అల్లర్లకు తానే గైడ్ మ్యాప్‌లు తయారుచేశానని చెప్పింది. ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. హనీప్రీత్ ఇచ్చిన సమాచారాన్ని ల్యాప్‌టాప్‌లో భద్రపరిచినట్లు చెప్పారు. పంచకులతో పాటు పలు ప్రాంతాల్లో చెలరేగిన హింస కేసుల్లో మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవకాశం ఉందని చెప్పారు.