: ప్రత్యేక రైలులో తాగునీరు లేక కుంభమేళా భక్తుల అవస్థ


మహాకుంభమేళాకు వెళ్లిన మన రాష్ట్ర భక్తులకు కష్టాలు తప్పడం లేదు. అలహాబాద్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ప్రత్యేక రైలులో తాగునీరు లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ప్రయాణీకులకు తాగునీరు అందేలా చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు జబల్ పూర్ రైల్వే స్టేషనులో ప్రయాణీకులకు తాగునీరు అందించే ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు.

  • Loading...

More Telugu News