కేసీఆర్: అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే టీఆర్ఎస్వీకి సీట్లు కేటాయిస్తా: సీఎం కేసీఆర్
- టీఆర్ఎస్వీ నాయకులతో కేసీఆర్ భేటీ
- విద్యార్థి నాయకులకు ఓ ఎమ్మెల్సీ స్థానం కూడా కేటాయిస్తా
- ప్రస్తుత పరిస్థితుల్లో 80 స్థానాల్లో గెలుస్తాం
- ఇంకొంచెం కష్టపడితే మరిన్ని స్థానాలు దక్కుతాయి
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య కనుక పెరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) కి మూడు నుంచి 5 సీట్లు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్వీ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ ఎమ్మెల్సీ స్థానం కూడా విద్యార్థి నాయకులకు కేటాయిస్తానని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో 80 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామని, ఇంకొంచెం కష్టపడితే మరిన్ని స్థానాల్లో గెలవగలమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం నిమిత్తం విద్యార్థి నాయకులకు కొన్ని సూచనలు చేశారు. ‘మిషన్ భగీరథ’, సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరించాలని వారికి సూచించారు. వచ్చే వారంలో రాష్ట్ర, జిల్లా కోఆర్డినేటర్లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు చెప్పారు.