మహేశ్ బాబు: ఆ పాత్రలో మహేశ్ బాబు నటించాలని నేను కోరుతున్నా..మీరు కూడా కోరండి’: పరుచూరి గోపాలకృష్ణ

  • కృష్ణ కోరుకున్నప్పటికీ నటించలేకపోయిన పాత్ర ‘ఛత్రపతి శివాజీ’
  • ఆ పాత్రకు మహేశ్ బాగుంటాడు
  • ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ

ఛత్రపతి శివాజీ పాత్రలో మహేశ్ బాబుని చూడాలని ఉందని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ‘పరుచూరి పలుకులు’ అనే వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘‘అల్లూరి సీతారామరాజు’గా సూపర్ స్టార్ కృష్ణ నటించేశారు. కానీ, కృష్ణగారు కోరుకున్నప్పటికీ నటించలేని పాత్ర ఒకటి అలానే మిగిలిపోయింది. అది ‘ఛత్రపతి శివాజీ’. శివాజీ గెటప్ కు కృష్ణ గారు ఎంత బాగా సరిపోతారో, మహేశ్ కూడా అంతే బాగుంటాడు. ఈ పాత్రలో నటిస్తే జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి పేరు వచ్చే అవకాశాలున్నాయి. ఆ పాత్రలో మహేశ్ బాబు నటించాలని నేను కోరుతున్నా..మీరు కూడా కోరండి’ అని ప్రేక్షకులను ఉద్దేశించి గోపాలకృష్ణ  అన్నారు.

  • Loading...

More Telugu News