ఏపీసీసీ: వర్ల రామయ్య తన స్థాయిని మరచి రఘువీరారెడ్డిపై విమర్శలు చేస్తున్నారు: ఏపీసీసీ
- వర్ల రామయ్య తన పదవిని కాపాడుకోవడానికి మాపై విమర్శలు చేస్తున్నారు
- చంద్రబాబు మెప్పుకోసం ఆరాట పడుతున్నారు
- ఏపీసీసీ ప్రెస్ నోట్
తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ వర్ల రామయ్య తన స్థాయిని మరచి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఏపీసీసీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. రాష్ట్రాభివృద్ధి కన్నా బీజేపీతో చేతులు కలిపి తిరగడానికే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. గెలుపు, ఓటములు కాంగ్రెస్ పార్టీకి సహజమని ప్రజాసేవే ముఖ్యమని పేర్కొంది. తమ పార్టీ అధికారం కోసం పని చేయదని, వర్ల రామయ్య తన పదవిని కాపాడుకోవడానికి చంద్రబాబు మెప్పు కోసం రఘువీరారెడ్డిని విమర్శిస్తున్నారని విమర్శించింది. 2019 ఎన్నికల్లో ప్రజలు ఎవరిని తరిమికొడతారో చూద్దామని సవాలు విసిరింది.