స్పీకర్ కోడెల: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సుమారు 10 రోజులు జరుగుతాయి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల
- ఢిల్లీలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల పర్యటన
- మీడియాతో మాట్లాడిన స్పీకర్
- వచ్చేనెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
వచ్చేనెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుపుతామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో పర్యటించిన శివప్రసాదరావు.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కోడెల మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల గురించి ప్రకటన చేశారు. సుమారు పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. కాగా, ఈ రోజు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి, సత్తెనపల్లిలోని కేంద్రీయ పాఠశాలలో మిగిలిన సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరినట్లు కోడెల చెప్పారు.