రాజమౌళి: గ్రీటింగ్స్ చెప్పిన వారందరికీ ఎన్నో కృతఙ్ఞతలు: దర్శకుడు రాజమౌళి
- బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ పలు ట్వీట్లు
- శుభాకాంక్షలు తెలిపినందుకు సంతోషం
- రాజమౌళి ట్వీట్
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా రాజమౌళి స్పందించారు. ‘నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి, దీవెనలు అందజేసినవారికి ఎన్నో కృతఙ్ఞతలు’ అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కాగా, రాజమౌళికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మోహన్ లాల్, మహేష్ బాబు, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తదితరులు ఉన్నారు.