సందీప్ కిషన్: హీరో సందీప్ కిషన్ ను ‘తాతా’ అన్న రెజీనా!
- ‘మిస్టర్ చంద్రశేఖర్’ చిత్ర బృందానికి సందీప్ కిషన్ అభినందనలు
- హీరోయిన్ రెజీనా పేరు కూడా ప్రస్తావన
- ‘తాతా కృతఙ్ఞతలు’ అంటూ రెజీనా స్పందన
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనాలు మంచి స్నేహితులు. ఎంతో సన్నిహితంగా ఉండే వీళ్లిద్దరూ, పరస్పరం సరదా వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటారు. తాజాగా, సందీప్ కిషన్ ని ‘తాతా’ అంటూ రెజీనా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రెజీనా ఈ ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. తమిళంలో సీనియర్ నటుడు కార్తీక్ తన కుమారుడు గౌతమ్ తో కలిసి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘మిస్టర్ చంద్రశేఖర్’ అనే టైటిల్ ను తమిళ హీరో శివకార్తికేయన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు. ఆ టైటిల్ ని తిరిగి పోస్ట్ చేసిన సందీప్ కిషన్, ఆ చిత్రయూనిట్ కి అభినందనలు తెలిపారు. సందీప్ కిషన్ అభినందనలు తెలిపిన వారిలో హీరోయిన్ రెజీనా పేరు కూడా ఉంది. దీంతో, ‘తాతా కృతఙ్ఞతలు’ అంటూ రెజీనా స్పందించడం సరదాగా ఉంది.