రాహుల్: అమేజింగ్.. ‘బేటీ బ‌చావో’ని ‘బేటా బ‌చావో’ చేసేశారు: అమిత్ షా కుమారుడి కంపెనీ ఆస్తుల‌ పెరుగుదలపై రాహుల్

  • ఎన్డీఏపై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు
  • అమిత్ షా కుమారుడు జై షాని కేంద్ర ప్రభుత్వం వెనకేసుకొస్తోందని వ్యాఖ్య
  • ఆరోప‌ణ‌లు కొట్టిపారేస్తోన్న బీజేపీ

భారతీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా కుమారుడు జై షాకు చెందిన కంపెనీ టర్నోవర్.. ఇటీవల ఒక్కసారిగా వేల రెట్లు పెరిగిపోయిన వైనాన్ని ఓ వెబ్‌ సైట్ వెల్లడించిన విష‌యం తెలిసిందే. ఈ అంశాన్ని లేవ‌నెత్తుతూ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎన్డీఏ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌ధాని మోదీ ఈ విష‌యంపై నోరు విప్పాల‌ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ విమర్శించారు. ఈ రోజు కూడా ఎన్డీఏపై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోన్న‌ ‘బేటీ బ‌చావో’ను ‘బేటా బ‌చావో’గా చేసేశార‌ని, ఇది అమేజింగ్ అని రాహుల్ చుర‌క‌లంటించారు. కేంద్ర మంత్రి పీయూష్‌గోయ‌ల్.. అమిత్ షా కుమారుడిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని రాహుల్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. కాగా, అమిత్ షా కుమారుడిపై వ‌స్తోన్న ఆరోప‌ణ‌లను బీజేపీ కొట్టిపారేస్తోంది. ఆయ‌న నిజాయతీగానే వ్యాపారం చేశాడ‌ని చెప్పుకొస్తోంది.

  • Loading...

More Telugu News