కాల్వ శ్రీనివాసులు: ఇది మరో రాజకీయ నాటకం.. జగన్ వ్యాఖ్యలపై మంత్రి కాల్వ శ్రీనివాసులు సీరియస్
- జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామా చేయించాలి
- జగన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
- ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రానికి మేలు
- జగన్ నాటకాలు ఆడుతున్నారు
ఈ రోజు అనంతపురంలో నిర్వహించిన యువభేరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జగన్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. యువభేరిలో జగన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రానికి మేలని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే పరిశ్రమలకు స్వర్గధామమని వ్యాఖ్యానించారు. జగన్ నాటకాలు ఆడుతున్నారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. యువభేరీ పేరుతో మరో రాజకీయ నాటకానికి తెరతీశాడని మండిపడ్డారు.