‘స్పైడర్’: ‘స్పైడర్’లో విలన్ క్యారెక్టర్ ను నేను చేయగలను: ‘జోష్’ రవి
- నన్ను ఎవరూ కమెడియన్ అని అనుకోరు
- ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఉంది
- విలన్ క్యారెక్టర్ ఇస్తే నా టాలెంట్ నిరూపించుకుంటా
తన ఫేస్ చూడగానే తనను ఎవరూ కమెడియన్ అని అనుకోరని యువ హాస్యనటుడు ‘జోష్’ రవి అన్నాడు. ‘ఐడ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కామెడీ చేయాలంటే నేను బాగా కష్టపడాలి. అయితే, అందులో సక్సెస్ అవుతాను. మార్పు కోసం చూస్తున్నా.. కామెడీ క్యారెక్టర్స్ ఇస్తే నేను చేయట్లేదు. ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని చూస్తున్నా. నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయాలని ఉంది. ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా చేయగలను. ‘స్పైడర్’లో విలన్ ఎస్.జె. సూర్య క్యారెక్టర్ ను నేను చేయగలను. అటువంటి క్యారెక్టర్ నాకు ఇవ్వాలంటే .. నాకు ఒక ఇమేజ్ వచ్చి ఉండాలి .. ఏదో హిట్ సినిమా చేసి ఉండాలి. అలా హిట్ అవ్వాలంటే, ఎవరైనా నన్ను నమ్మి ఓ అవకాశం ఇవ్వాలి. నాకు టాలెంట్ ఉంది..నన్ను నమ్మి అటువంటి క్యారెక్టర్ ఇస్తే చేయగలను’ అన్నాడు.