దండం: ఒకే బైకుపై ఐదుగురి ప్రయాణం.. వారికి 'దండం' పెట్టిన పోలీస్ ఫొటో వైరల్!

  • ఒకే బైకుపై ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలతో ఓ వ్యక్తి ప్రయాణం
  • వారికి ఏం చెప్పాలో అర్థం కాక దండం పెట్టిన పోలీస్
  • అనంతపురంలో ఘటన

భారత్‌లో లెక్క‌లేన‌న్ని రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఇప్ప‌టికే ఎన్నో స‌ర్వేలు స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. రోడ్డు ప్ర‌మాదాలను నివారించ‌డానికి పోలీసులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోన్నా వాహ‌నదారులు మాత్రం ట్రాఫిక్ నియ‌మాలు పాటించ‌కుండా ప్రమాదాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. అనంత‌పూర్‌లో జరిగిన ఓ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ జిల్లాలోని మ‌డ‌క‌సిర‌లో ఒక బైకుపై ఓ వ్య‌క్తి హెల్మెట్ లేకుండా ప్ర‌యాణించాడు. అంతేకాదు, ఆ వ్య‌క్తితో పాటు ఆ బైక్‌పై ఏకంగా ఐదుగురు ఉన్నారు.

అందులో ఇద్ద‌రు చిన్నారులు, ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు. ఇంత ప్ర‌మాద‌క‌రంగా ఆ వ్య‌క్తి బైకుపై ప్ర‌యాణిస్తోంటే ఏం చెప్పాలో తెలియ‌క శుభ‌కుమార్ అనే ఇన్స్‌పెక్ట‌ర్ వారికి దండం పెట్టేశాడు. ఇలా ప్ర‌యాణిస్తే ఎలా? అంటూ ప్ర‌శ్నించాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ చేతులెత్తి ఆయ‌న‌ దండం పెడుతుండ‌గా తీసిన ఫొటో ట్విట్ట‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మీరూ చూడండి...

  • Loading...

More Telugu News