జోష్ రవి: ఐదేళ్ల వయసులోనే మా అమ్మగారికి పోలియో వచ్చింది: హాస్యనటుడు ‘జోష్’ రవి

  • అప్పట్లో మాకు వీల్ చైర్ కొనుక్కునే స్థాయి కూడా లేదు
  • మా అమ్మ ఓ కర్రతో టీవీ స్విచ్  వేసేది
  • ఆమెకు ప్రతిగదిలో ఓ కర్ర ఉంటుంది
  • ఓ ఇంటర్వ్యూలో ‘జోష్’ రవి

తన తల్లికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే పోలియో వచ్చిందని ప్రముఖ హాస్యనటుడు ‘జోష్’ రవి గుర్తుచేసుకుని బాధపడ్డాడు. వెబ్ ఛానెల్ ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అప్పట్లో, మాకు వీల్ చైర్ కొనుక్కునే స్థాయి కూడా లేదు. టీవీ స్విచ్ వేయాలంటే ఇంట్లో ఎవరూ ఉండే వారు కాదు. దీంతో, ఒక కర్రతో ఆమె స్విచ్ వేసేది. ఆమెకు ప్రతి గదిలో ఓ కర్ర ఉంటుంది. ఆ కర్రతో కరెక్టుగా ఆ స్విచ్ ను వేస్తారు. నడవలేని నా తల్లి ఎంతో కష్టపడి, క్రమశిక్షణతో ఎదిగి చదువుకున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్ .. మనం నిజాయతీగా బతికినంతకాలం మనకు ఏ చెడూ జరగదు. నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో.. స్కూల్ అయిపోగానే ఆడుకోవడానికి కాకుండా ఇంటికే వెళ్లిపోయేవాడిని’ అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News