చై: చైతూ పక్కన ఎరుపు రంగు దుస్తుల్లో, మంగళ సూత్రంతో కనపడుతోన్న సమంత.. ఫొటో వైరల్!
- రెండు రోజుల క్రితం నాగచైతన్య, సమంత వివాహం
- పెళ్లయిన తరువాత బయటకు వచ్చిన మొదటి ఫొటో
- ప్రత్యూష ఆర్గనైజేషన్ డాక్టర్ మంజులతో ఫొటో
రెండు రోజుల క్రితం సినీనటులు నాగచైతన్య, సమంత వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో సింపుల్‌గా జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే హైదరాబాద్‌లో వీరి పెళ్లి రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లయిన తరువాత ఈ జంట దిగిన ఓ ఫొటో ఫేస్‌బుక్‌లో వైరల్ గా మారింది. వారిద్దరు ప్రత్యూష ఆర్గనైజేషన్ డాక్టర్ మంజులతో ఫొటో దిగారు.
కొత్త పెళ్లి కూతురు సమంత ఎరుపు రంగు దుస్తుల్లో చిరునవ్వు చిందిస్తూ ఉంది. మెడలో మంగళసూత్రం కూడా కనపడుతోంది. ప్రస్తుతం చైతూ, శామ్ సినిమాల్లోనూ బిజీబిజీగా ఉన్నారు. పెళ్లయిన కొన్ని రోజులకే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటానని కూడా సమంత ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.