సింగరేణి: సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పై వేటు.. 2,718 బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ!

  • ఇచ్చిన హామీలను నెరవేర్చిన సీఎం కేసీఆర్
  • కొత్త చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా మంతా శ్రీనివాస్
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
  • బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ దస్త్రంపై సంతకం

కార్మికుల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్నసింహాపై బదిలీ వేటు పడింది. కొత్త చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా మంతా శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ నిన్న సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సదరు మెడికల్ ఆఫీసర్ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కేసీఆర్ కు కార్మికులు ఫిర్యాదు చేశారు.

 ఈ నేపథ్యంలో ఆ అధికారిని తక్షణం బదిలీ చేస్తానంటూ కేసీఆర్ నిన్న హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 24 గంటల్లోనే ప్రసన్న సింహాను బదిలీ చేయడం గమనార్హం. కాగా, సింగరేణిలో 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించే దస్త్రంపై సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ శ్రీధర్ సంతకం చేశారు. 2016, డిసెంబర్ 31 నాటికి తగిన హాజరుశాతం గల కార్మికులకు జనరల్ మజ్జూర్లుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని, రెండు రోజుల్లో వీటిని కార్మికులకు అందజేయనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News