ఉపాసన: మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన సాహసం!.. వీడియో చూడండి!
- ఓ రియాల్టీ షోలో ఉపాసన సాహసం
- సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్ చల్
- కోచ్ సాయంతోనే చేయగలిగా
- ఈ గొప్పతనమంతా నా కోచ్ కే దక్కుతుందన్న ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తన ఆరోగ్యం, ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ మధ్య, ఓ రియాల్టీ షో లో పాల్గొన్న ఆమె, తన కోచ్ సాయంతో సాహస విన్యాసాలు చేశారు. ఈ షోలో భాగంగా తన ముందు ఉంచిన లక్ష్యాలను ఎంతో ధైర్యంతో ఉపాసన ఛేదించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ, తన కోచ్ సాయం లేకుండా ఈ లక్ష్యాలను ఛేదించగలిగే దానిని కాదని, ఈ గొప్పతనమంతా ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.