కోహ్లీ: ధోనీ ఇంటికెళ్లి జీవాతో ఆడుకున్న కోహ్లీ
- ముద్దులొలికే ధోనీ కూతురు జీవాతో కోహ్లీ ముచ్చట్లు
- ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిన కోహ్లీ
- కుక్కలు, పిల్లుల గురించి మాటలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జార్ఖండ్ డైమండ్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో మరోసారి సరదాగా ఆడుకున్నాడు. రాంచీ వేదికగా మొన్న జరిగిన టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత కోహ్లీ.. ధోనీ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా జీవాతో కలిసి కోహ్లీ సరదాగా ముచ్చటించాడు. కుక్కలు, పిల్లుల గురించి ఇద్దరూ మాట్లాడుకుని, వాటిని ఇమిటేట్ చేశారు. ముద్దులొలికే జీవాతో కలిసి మళ్లీ ఆడుకున్నానని తెలుపుతూ కోహ్లీ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. గతంలో కూడా జీవాతో కలిసి తీసుకున్న ఫొటోలను కోహ్లీ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.