మహేశ్ బాబు: ఫ్యామిలీ ఫొటోల్లో మహేశ్ మిస్.. అభిమానుల ఆరా!
- ఇటలీలో మహేశ్ ఫ్యామిలీ
- టస్కనీలో పిల్లలతో దిగిన ఫొటోలను పోస్ట్ చేసిన నమ్రత
- ఆ ఫొటోల్లో మహేశ్ బాబు ఏడంటూ నెటిజన్ల ఆరా
హీరో మహేశ్ బాబు కుటుంబం ప్రస్తుతం ఇటలీ దేశంలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా టస్కనీ ప్రాంత పర్యటనలో దిగిన కొన్ని ఫొటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోల్లో మహేశ్ మినహా నమ్రత, పిల్లలు గౌతమ్, సితార ఉన్నారు.
అక్కడి ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉందని నమ్రత, సరదాగా గడుపుతున్నామని గౌతమ్, సితార తమ పోస్ట్ లలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ‘‘క్యూట్’, ‘వెరీ నైస్’, ‘మిస్సింగ్ సమ్ థింగ్’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.
కాగా, ‘స్పైడర్’ సినిమా విడుదలైన అనంతరం సరదాగా గడిపేందుకు మహేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీకి వెళ్లాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అను నేను’ చిత్రంలో మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ నెల 11 నుంచి ఈ సినిమా షూటింగ్ లో మహేశ్
పాల్గొననున్నాడు.