మోహన్ బాబు: 'ఆత్మీయ సోదరులు పరిటాల రవి, దేవినేని నెహ్రూ' అంటూ అరుదైన ఫొటో పోస్ట్ చేసిన మోహన్ బాబు

  • ఫొటోలో పరిటాల రవి, మోహన్ బాబు, దేవినేని నెహ్రూ
  • ముగ్గురూ యంగ్ గా కనిపిస్తున్నారు 
  • అభిమానులను ఆకర్షిస్తోన్న ఫొటో

టీడీపీ దివంగత నేతలు పరిటాల రవి, దేవినేని నెహ్రూలతో తాను గతంలో దిగిన ఓ ఫొటోను సినీ న‌టుడు మోహ‌న్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండే అత్యంత ఆత్మీయ సోదరులు పరిటాల రవి, దేవినేని నెహ్రూ’ అని మోహ‌న్ బాబు ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. చేతిలో పుష్ప‌గుచ్ఛాలు ప‌ట్టుకుని ఈ ముగ్గురు నిల్చుని ఉన్నారు. ఇందులో ముగ్గురూ యంగ్‌గా క‌నప‌డుతున్నారు. ఈ అరుదైన ఫొటో అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది.  

  • Loading...

More Telugu News