కిమ్ చెల్లి: సోదరికి కీలక బాధ్యతలు.. వారసత్వం భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని కిమ్ జాంగ్ ఉన్ ప్లాన్
- అధికార వర్కర్స్ పార్టీలో కీలక నిర్ణయం
- రేపు వర్క్‌ర్స్ పార్టీ 72వ వార్షికోత్సవం
- సెంట్రల్ కమిటీ నిర్ణయాత్మక మండలిలో ప్రత్యామ్నాయ సభ్యురాలిగా కిమ్ చెల్లి
తమ అధికార వర్కర్స్ పార్టీలో తన చెల్లెలు కిమ్ యో జాంగ్ (30) కి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఉన్నత పదవిని ఇస్తున్నట్లు ప్రకటించారు. రేపు వర్క్‌ర్స్ పార్టీ 72వ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేశంలో ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిన్న ఓ కార్యక్రమంలో తన చెల్లితో కలిసి పాల్గొన్న కిమ్ జాంగ్ ఉన్.. ఆమెను పార్టీ సెంట్రల్ కమిటీ నిర్ణయాత్మక మండలిలో ప్రత్యామ్నాయ సభ్యురాలిగా నియమించారు. 1948లో ఉత్తరకొరియా ఏర్పడినప్పటి నుంచి కిమ్ కుటుంబీకులే వారసత్వంగా అధ్యక్షులుగా ఉంటూ వస్తున్నారు.
తన తండ్రి కిమ్ జాంగ్ 2 మరణించిన తరువాతి నుంచి కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశ అధ్యక్షుడిగా ఉంటున్నారు. తన వారసత్వం భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని, తమ దేశంపై తమ కుటుంబ సభ్యుల నియంత్రణ ఉండాలని కిమ్ జాంగ్ ఉన్ యోచిస్తున్నారు. అందులో భాగంగానే తన సోదరికి కీలక బాధ్యతలు అప్పగించారు.