lavanyatripathi: హిట్ కోసం పారితోషికం తగ్గించేసిన లావణ్య?
- యూత్ లో లావణ్య త్రిపాఠికి క్రేజ్
- ఈ మధ్య వరుసగా పలకరిస్తోన్న పరాజయాలు
- సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే పట్టుదలతో లావణ్య
- ఆ దిశగా తనవంతు ప్రయత్నాలు
ఆ మధ్య లావణ్య త్రిపాఠి వరుస విజయాలతో దూసుకుపోయింది. 'భలే భలే మగాడివోయ్' .. 'సోగ్గాడే చిన్ని నాయనా' హిట్స్ తో ఆమె స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీనే ఇస్తుందని అంతా భావించారు. కానీ దురదృష్టం కొద్దీ ఆ తరువాత ఆమెను అపజయాలు పలకరిస్తూ వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన 'యుద్ధం శరణం' సినిమా కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆమె వున్నట్టుగా వినికిడి.
మంచి కథలు .. మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశంతో వున్న ఆమె, అలాంటి అవకాశాలను సొంతం చేసుకోవడం కోసం పారితోషికాన్ని తగ్గించుకుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'ఉన్నది ఒకటే జిందగీ' కోసం పారితోషికం తగ్గించుకుని 50 లక్షలు మాత్రమే తీసుకున్న లావణ్య, వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన చేస్తోన్న సినిమా కోసం కూడా అంతే తీసుకుందని అంటున్నారు. లావణ్య తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.