తెలుగు రాష్ట్రాలు: తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి లారీల బంద్

- లారీ యజమానుల సంఘం ప్రకటన
- మద్దతు ప్రకటించిన తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్
- అత్యవసర సరుకుల రవాణా మినహా అన్ని సేవలు బంద్
తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి లారీల బంద్ జరగనుంది. జీఎస్టీ, రోజువారీ డీజిల్ ధరల మార్పిడి, రహదారులపై పన్ను వసూలు విధానాలకు నిరసనగా లారీ యజమానుల సంఘం బంద్ ప్రకటించింది. ఈ బంద్ కు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించింది.
అత్యవసర సరుకుల రవాణా తప్పా, మిగతా అన్ని సేవలు బంద్ చేస్తున్నట్టు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సింగిల్ పర్మిట్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం ఏపీకి లేఖ రాసిందని ఈ నెలాఖరులోపు ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే కోదాడ దగ్గర హైవే ను దిగ్బంధిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.