అమరావతి: ఏకపక్షంగా నిర్మించిన రాజధానులు విజయవంతం కాలేదు: ఐవైఆర్ కృష్ణారావు
- ఏపీ రాజధానిని అందరి అంగీకారంతోనే నిర్మించాలి
- ప్రభుత్వానికి తలనొప్పిగా మారనున్న ల్యాండ్ పూలింగ్
- రాజధానిగా దొనకొండ అందరికీ ఆమోదయోగ్యం
ఏకపక్షంగా నిర్మించిన రాజధానులు విజయవంతం కాలేదని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాజధానిని అందరి అంగీకారంతోనే నిర్మించాలని, రాజధానులు మహానగరాలుగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. మహానగరమే అవసరం అనుకుంటే విశాఖపట్టణాన్ని ఎంపిక చేసి ఉండాల్సిందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ భవిష్యత్ లో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుందని, శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాజధానిని ఎంపిక చేసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధానిగా అమరావతి కన్నా దొనకొండ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని, దొనకొండలో ప్రభుత్వ భూములతో పాటు అన్ని వసతులు ఉన్నాయని అన్నారు.