సింగరేణి: ఇప్పటివరకు కార్మిక సంఘాలే గెలిచాయి కానీ, కార్మికులు గెలవలేదు!: సీఎం కేసీఆర్
- ప్రగతి భవన్ లో సింగరేణి కార్మికులతో సమావేశం
- ఆర్టీసీ, విద్యుత్ సంస్థల సమస్యలను క్రమంగా పరిష్కరించాం
- అధికారంలోకి వచ్చాక.. సింగరేణిపై శ్రద్ధ పెట్టలేదన్న కేసీఆర్
సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ను గెలిపించిన కార్మికులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సింగరేణి కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఈ గెలుపు సింగరేణిలోని ప్రతి కార్మికుడి గెలుపు కావాలని అన్నారు.
ఇప్పటివరకు కార్మిక సంఘాలు గెలిచాయి కానీ, కార్మికులు గెలవలేదని అన్నారు. ఆర్టీసీ, విద్యుత్ సంస్థల సమస్యలను క్రమంగా పరిష్కరించామని అన్నారు. గతంలో టీబీజీకేఎస్ గెలిచినప్పటికీ ఆశించినంతగా పనులు జరగలేదని, అధికారంలోకి వచ్చాక, తాను కూడా సింగరేణిపై శ్రద్ధ పెట్టలేదని ముఖ్యమంత్రి అన్నారు.