మిరాలం చెరువు: హైదరాబాద్ లో పొంగి పొర్లుతున్న మీరాలం చెరువు

  • నెహ్రూ జంతు ప్రదర్శనశాల లోకి చేరిన నీరు
  • సఫారీ పార్క్, రైలు, బ్యాటరీ వాహనాల మూసివేత
  • హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

వర్షాల కారణంగా హైదరాబాద్ లోని మీరాలం చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోకి నీరు వచ్చి చేరుతోంది. జంతు ప్రదర్శనశాలలోని సఫారీ పార్క్, రైలు, బ్యాటరీ వాహనాలను మూసివేసినట్టు సంబంధిత అధికారుల సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోజంఖాన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.

 కాగా, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మొదలైన ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండాలో వర్షానికి పశువుల పాక కూలడంతో ఓ రైతు మృతి చెందాడు.

  • Loading...

More Telugu News