క్రికెట్: రాంచీ టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా!

  • రాంచీలో మొదటి టీ20 మ్యాచ్
  • ఆసీస్‌కి కెప్టెన్‌గా వార్న‌ర్
  • టీ20ల్లోనూ గెలుపుపై కన్నేసిన టీమిండియా

టీమిండియా, ఆసీస్ మ‌ధ్య మ‌రికాసేప‌ట్లో రాంచీలో మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. స్మిత్ భుజానికి గాయం కావడంతో, ఆసీస్‌కి కెప్టెన్‌గా వార్న‌ర్ బాధ్యత‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఇప్ప‌టికే 4-1 తేడాతో వ‌న్డే సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు టీ20 మ్యాచుల్లోన‌యినా గెలవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లోనే కాకుండా వ‌న్డేల్లోనూ నెంబ‌ర్ వ‌న్ స్థానానికి దూసుకొచ్చిన టీమిండియా టీ20ల్లో మాత్రం 115 పాయింట్ల‌తో ఐదో స్థానంలో ఉంది. వ‌న్డే మ్యాచుల్లోనూ గెలిచి ర్యాంక్‌ను మెరుగుప‌ర్చుకోవాల‌ని చూస్తోంది. భారత్ జట్టు ఆటగాళ్లలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మనీశ్ పాండే, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, చాహల్ ఉన్నారు.

  • Loading...

More Telugu News